P.V Memorial lecture by Dr.Shashi Tharoor at 5pm in Sakalam channel
About the Event
పాములపర్తి వేంకట నరసింహారావు స్మారకోపన్యాసం ఈ సంవత్సరం ప్రఖ్యాత రచయిత, పార్లమెంటు సభ్యుడు డాక్టర్ శశిథరూర్ ఈ నెల ఇరవై మూడవ తేదీ సాయంత్రం అయిదు గంటలకు చేస్తారు. కోవిద్ మహమ్మారి కారణంగా ఈ ఏడు పీవీ స్మారకోపన్యాసం భౌతికంగా నిర్వహించలేకపోతున్నందుకు చింతిస్తున్నాం. జూమ్ ద్వారా జరిగే సభకి కేంద్ర సమాచార కమిషన్ మాజీ సభ్యులూ, ప్రస్తుతం నోయిడాలోని బెనెట్ యూనివర్శిటీలో లా డీన్ గా పని చేస్తున్న ప్రసిద్ధ రచయిత ప్రొఫెసర్ మాడభూషి శ్రీధరాచార్యులు అధ్యక్షత వహిస్తారు. స్మారకోపన్యాస నిర్వాహకులూ, సకలం చానెల్, ప్రైమ్ పోస్ట్ వెబ్ న్యూస్ పేపర్ ఎడిటర్-ఇన్-చీఫ్ డాక్టర్ కె. రామచంద్రమూర్తి స్వాగతం పలుకుతారు. డాక్టర్ థరూర్ మన విదేశాంగ విధానంలో పీవీ వారసత్వం పైన ప్రసంగిస్తారు. ఆయన ప్రసంగం టంచన్ గా డిసెంబర్ 23వ తేదీ సాయంత్రం అయిదు గంటలకు ప్రారంభం అవుతుంది. పీవీ నరసింహారావుగారు 2004 డిసెంబర్ 23న దివంగతులైనారు. ఆ తర్వాత ఎనిమిది సంవత్సరాల తర్వాత 31 డిసెంబర్ 2012నాడు హైదరాబాద్ లోని జూబిలీ హాలులో పీవీ స్మారకోపన్యాస పరంపరను నాటి రాష్ట్రపతి ప్రణబ్ కుమార్ ముఖర్జీ ఆరంభించారు. ఆ తర్వాత కాంగ్రెస్ నాయకుడూ, కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్, గాంధీ, రాజగోపాలాచారి మనుమడూ, ప్రఖ్యాత రచయిత రాజ్ మోహన్ గాంధీ, కేంద్ర మాజీ మంత్రి, బహుగ్రంథ రచయిత జైరాం రామేష్, న్యాయకోవిదుడు జస్టిస్ మానేపల్లి నారాయణరావు వెంకటాచలయ్య, సుప్రసిద్ధ పాత్రికేయుడు, ది ప్రింట్ ఎడిటర్-ఇన్-చీఫ్ శేఖర్ గుప్తా, ప్రముఖ అధ్యాపకుడూ, హెరాల్డ్ లాస్కీ శిష్యుడూ ప్రొఫెసర్ చంద్రశేఖరరావు పీవీ స్మారకోపన్యాసాలు చేశారు.
Location Map
Live
India